05-04-2025 12:00:00 AM
సుల్తానాబాద్, ఏప్రిల్04 (విజయ క్రాంతి): ఆగి ఉన్న లారీని కారు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలైన సంఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ శివారులో చోటుచేసుకుంది... స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... రామగుండం కు చెందిన నిషార్ అహ్మద్ , ఎండి గౌస్ లు హైదరాబాద్ వెళ్లి తిరుగు ప్రయాణంలో గోదావరిఖని కి వస్తుండగా శుక్రవారం తెల్లవారు జామున సుల్తానాబాద్ శివారులోని లారీ అసోసియేషన్ సమీపంలో ఆగి ఉన్న లారీని ఢీకొట్టారు...
ఈ ప్రమాదంలో నిషాద్ అహ్మద్ అక్కడికక్కడే మృతిచెందగా, తీవ్ర గాయాల గురైన గౌస్ ను ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు, పోస్టుమార్టం కోసం మృతదేహా లను సుల్తానాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్త్స్ర శ్రావణ్ కుమార్ తెలియజేశారు.