జైపూర్: రాజస్థాన్ రాష్ట్రం భికనేర్ లో బుధవారం మధ్యాహ్నం ఇద్దరు సైనికులు దుర్మరణం పాలయ్యారు. మందుగుండు సామగ్రి పేలి ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో ఓ జవాను గాయపడ్డాడు. గాయపడిన సైనికుడిని సూరత్‌గఢ్‌లోని ఆర్మీ ఆసుపత్రిలో చేర్చారు. మందుగుడు సామగ్రిని వాహనంలోకి ఎక్కిస్తుండగా ప్రమాదం సంభవించింది. మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ ఉత్తర రేంజ్‌లో సైనిక విన్యాసాల్లో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంపై సమాచారం అందుకున్న మిలటరీ అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు.