22-04-2025 12:32:45 AM
నిర్మల్ ఏప్రిల్ 21 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో ఎండలు రికార్డ్ స్థాయిలో మండిపోతున్నాయి సోమవారం ఎండల కారణంగా వడదెబ్బతో పట్టణంలోని కోరన్నపేట కాలనీ చెందిన ఇద్దరు డప్పు కార్మికు లు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు, కురున్నపేట్ కాలనీకి చెందిన ఆర్ శంకర్(48), ఎన్ రాజు(42) అని ఇద్దరు డప్పు కార్మికులు ఆదివారం పోచమ్మ పండుగకు డప్పు వాయించడానికి వెళ్లి రోజంతా ఎండలో డప్పు వాయించడంతో రాత్రి అస్వస్థకు గురయ్యారు.
తల తిరిగి వాంతులు చేసుకోవడంతో పాటు జ్వరం రావడంతో వారిని పట్టణంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా సోమవారం మధ్యాహ్నం చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కులవృత్తిని నమ్ముకుని జీవిస్తున్న వీరు వడదెబ్బతో మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు నెలకొన్నాయి, ఇదిలా ఉండగా నిర్మల్ జిల్లా లో సోమవారం అత్యధికంగా ఉష్ణోగ్రతల నమోదైనట్టు అధికారులు తెలిపారు. నిర్మల్ జిల్లా నర్సాపూర్ జి మండల కేంద్రంలో 43.9 గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కాగా పెం బికడెం దస్తురాబాద్ మండలలో 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.