calender_icon.png 20 January, 2025 | 7:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తిరుపతిలో రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్ వాసులు మృతి

20-01-2025 04:11:10 PM

తిరుపతి: తిరుపతిలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రేణిగుంట(Renigunta)సమీపంలోని కుక్కలదొడ్డి మధ్యలో ఎదురుగా వస్తున్న ప్రైవేట్ బస్సు, కారు ఢీకొనడంతో కారు నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు తెలంగాణ వాసులు(Telangana People) అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులను హైదరాబాద్‌లోని పటాన్‌చెరుకు చెందిన అంజలీదేవి (40), సందీప్ (45)గా గుర్తించారు. తిరుపతి నుంచి హైదరాబాద్‌(Tirupati to Hyderabad)కు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ దుర్ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.