calender_icon.png 28 December, 2024 | 2:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిజామాబాద్ చెరువులో మునిగి.. ఇద్దరు హైదరాబాదీలు మృతి

03-11-2024 03:13:51 PM

సరదాగా స్నానానికి వెళ్లి చెరువు ఊబిలో చిక్కుకొని దుర్మరణం

 దర్గాకు దర్శనానికి వచ్చి మృతి చెందిన హైదరాబాద్ వాసులు

నిజామాబాద్, (విజయ క్రాంతి): నిజామాబాద్ జిల్లాలో ఆదివారం చెరువులో స్నానానికి వెళ్లిన ఇద్దరు హైదరాబాదుకు చెందిన యువకులు చెరువు ఉబ్బిలో చిక్కుకొని దుర్మరణం చెందారు. స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా  ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం మంచి ప గ్రామంలో దర్గా ఉంది. దర్గా వద్ద దర్శనం కోసం హైదరాబాదుకు చెందిన బంధువుల తో వచ్చిన ఇద్దరు యువకులు బంధువులతో కలిసి దర్గాలో దర్శనమైన తర్వాత సరదాగా మంచి ప చెరువులో స్నానం చేసేందుకు వెళ్లారు.

హైదరాబాద్ కు చెందిన మూస( 18) అనే యువకునితోపాటు వసీం( 19) లు చెరువులో స్నానానికి వెళ్లి నీట మునిగి మృతి చెందారు. స్థానికులు గుర్తించి వారి బంధువులకు సమాచారం అందించారు. అప్పటిలోగా చెరువులో వారిని స్థానికులు వెతకగా సయ్యద్ మూసా మృతదేహం దొరికింది. రెస్కు టీం వచ్చి చెరువులో గాలించగా వసీం మృతదేహం లభ్యమైనట్లు తెలిపారు. చుట్టపు చూపుగా వచ్చిన ఇద్దరు హైదరాబాద్ కు చెందిన యువకులు దర్గా వద్ద దర్శనం చేసుకుని సరదాగా స్నానానికి వెళ్లి చెరువుల్లోని ఉబ్బిలో చిక్కుకొని దుర్మరణం చెందడం స్థానికులను కలచివేసింది.