10-03-2025 12:00:00 AM
ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రి కి కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే
మద్నూర్, మార్చి 9 (విజయ క్రాంతి), కామారెడ్డి జిల్లాకు రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ భవన నిర్మాణానికి 200 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసినట్లు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఆదివారము ఒక ప్రకటనలో తెలిపారు. కామారెడ్డి జిల్లా లో అత్యంత వెనుకబడిన నియోజకవర్గమైన జుక్కల్ నియోజకవర్గానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాలను మంజూరు చేయడంతో పాటు నిధులు విడుదల చేయడం పట్ల జుక్కల్ నియోజకవర్గ ప్రజల తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు తెలిపారు.