రూ.4లక్షల ఆస్తి నష్టం
కామారెడ్డి, నవంబర్ 27 (విజయక్రాంతి): విద్యుదాఘాతంతో రెండు ఇళ్లు దగ్ధమైన ఘటన కామారెడ్డి జిల్లా లింగంపేట్‌లో చోటుచేసుకున్నది. స్థానికుల కథనం మేరకు.. లింగంపేట్‌కు చెందిన గుండా బాలకిషన్, గుండా స్వామి ఇళ్లల్లో మంగళవారం రాత్రి షా ర్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేశారు. బుధవారం తహసీల్దా ర్ నరేందర్ ఘటనా స్థలాన్ని పరిశీలిం చి.. పంచానామా చేసి సుమారు రూ. 4లక్షల ఆస్తినష్టం జరిగినట్టు అంచనా వేశారు.