07-04-2025 10:33:10 PM
బాన్సువాడ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బీర్కూర్ మహాత్మా జ్యోతి బాపూలే గురుకుల పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు సోమవారం అదృశ్యమయ్యారు. ఎనిమిదో తరగతి చదువుతున్న గువ్వ సాయి విశాల్, మాదరి చరణ్ ఉదయం నుంచి పాఠశాలలో కనిపించలేదు. దీంతో ఉపాధ్యాయులు వారి కోసం గాలించినా ఆచూకీ లభించకపోవడంతో ప్రిన్సిపాల్ శివకుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు.