calender_icon.png 20 April, 2025 | 2:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అయ్యో పాపం!

15-04-2025 01:36:32 AM

కారు డోర్ లాక్ అయి, ఊపిరాడక అక్కాచెళ్లెల్ల మృతి

మేనమామ పెళ్లి కోసం వచ్చి అనంతలోకాలకు..

చేవెళ్ల మున్సిపల్ దామరిగిద్దలో విషాదం

చేవెళ్ల, ఏప్రిల్ 1: మేనమామ పెళ్లి కోసం వచ్చిన ఇద్దరు చిన్నారులు.. కారులో ఆడుకుంటుండగా డోర్లు లాక్‌కావడంతో ఊపిరాడక మృతిచెందారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మున్సిపాలిటీ పరిధిలోని దామరగిద్దలో సోమవారం జరిగింది. దామరిగిద్దకు చెందిన తెలుగు జంగయ్య కొడుకు రాంబాబు వివాహం ఈ నెల 30న నిశ్చయమైంది.

పెళ్లి పనుల కోసం ఆయన కూతుళ్లు, అళ్లుల్లు వచ్చారు. చేవెళ్ల మండలం పామెన గ్రామానికి చెందిన కావలి వెంకటేశ్, జ్యోతి దంపతులు, వారి కుమార్తె తన్మయశ్రీ (5), షాబాద్ మండలం సీతారంపూర్ గ్రామానికి చెందిన మహేందర్, ఉమారాణి దంపతులు, వారి కుమార్తె అభినయశ్రీ(4) దామరిగిద్దకు వచ్చారు. సోమవారం పెళ్లి పనుల్లో భాగంగా కుటుంబసభ్యులు, బంధువులు పెళ్లి పత్రికలను సమకూరుస్తున్నారు.

అప్పటి వరకు ఇంట్లోనే ఆడుకున్న తన్మయశ్రీ, అభినయశ్రీ మధ్నాహ్నం 12.30 గంటల సమయంలో బయటికి వెళ్లారు. ఇంటి ఎదురుగా పార్క్ చేసిన మేనమామ రాంబాబుకు చెందిన కారు ఎక్కారు. కారులో ఆడుకుంటున్న సమయంలో డోర్లు లాక్ కావడంతో అందులోనే ఉండిపోయారు. పనుల్లో బిజీగా ఉన్న కుటుంబ సభ్యులు పిల్లలను గమనించలేదు.

మధ్నాహ్నం 2 గంటల సమయంలో చిన్నారులను పిలిచినా పలుకకపోవడంతో బయ టికి వచ్చి చూడగా కారులో స్పృహ తప్పి పడి ఉన్నారు.  వెంటనే కారు లాక్ తీసి చేవెళ్లలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. ఊపిరాడక అప్పటికే చిన్నారులు చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న పిల్లలు కళ్ల ముం దే ప్రాణాలు కోల్పోవడంతో ఆస్పత్రి ప్రాంగణంలోనే తల్లిదండ్రుల రోదనలు మిన్నం టాయి. చిన్నారుల మృతితో మూడు గ్రామా ల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.