calender_icon.png 29 November, 2024 | 4:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీశైలం గేట్లు మళ్లీ ఓపెన్....!

28-08-2024 10:40:35 AM

రెండు గేట్లు పది ఫీట్ల మేర దిగువకు కృష్ణమ్మ

నాగర్ కర్నూల్, (విజయక్రాంతి): ఎగువ నుండి భారీగా వరద తాకిడికి జూరాల జలాశయం నుండి శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టు అధికారులు బుధవారం రెండు గేట్లను 10 ఫీట్ల మేర ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ఎగువ నుండి 2,55,370 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా, ప్రస్తుతం 215 టీఎంసీలు 885 అడుగుల మేర నీటి నిల్వ ఉండడంతో ఎగువ నుంచి వస్తున్న వరద నీటిని సాగర్ వైపు మళ్లించారు. గత నెల 29న మొదటిసారి ఓపెన్ చేసిన అధికారులు వరుసగా పది రోజులపాటు ప్రాజెక్టు గేట్లు ఎత్తి ఉంచారు. వరదనీరు తగ్గుముఖం కట్టడంతో స్టోరేజీ కోసం గేట్లను మూసిన అధికారులు మళ్లీ నేడు వరద ఉధృతి కారణంగా రెండు గేట్లను ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు.