02-09-2024 02:35:45 AM
5.3 కిలోల గంజాయి, 2 మొబైల్స్ స్వాధీనం
ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 1 (విజయక్రాంతి): ఇద్దరి గంజాయి విక్రేతల నుంచి 5.3 కిలోల గంజాయిని ఆదివారం ఆదిభట్ల పోలీసులు పట్టుకు న్నారు. ఒడిశాకు చెందిన సంతోష్ సర్కార్ (78), బిశ్వజిత్ మధు (31) ఇద్దరు కొంగరకలాన్‌లో కన్‌స్ట్రక్షన్ వర్క్ చేస్తున్నారు. సంతోష్ సర్కార్ ఒడిశా నుంచి గంజాయి తీసుకొచ్చి బిశ్వజిత్ సహాయంతో స్థానికంగా పనిచేస్తున్న కార్మికులకు అమ్మేందుకు ప్రయత్నించాడు. సమాచారం అందుకున్న మహేశ్వరం జోన్ ఎస్‌ఓటీ బృం దం, ఆదిభట్ల పోలీసులతో కలిసి కొం గరకలాన్ సమీపంలోని కల్వకోల్ ఫం క్షన్‌హాల్ వద్ద నిందితులను పట్టుకున్నారు. గతంలోనూ వీరిపై కేసులు ఉన్నట్టు విచారణలో తేలింది. వీరి నుంచి 5.3 కిలోల గంజాయి, రెండు మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు.