calender_icon.png 15 January, 2025 | 9:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇద్దరు గంజాయి విక్రేతల అరెస్టు

04-07-2024 03:34:27 AM

నిజామాబాద్, జూలై 3(విజయక్రాంతి): నిజామాబాద్ నగరంలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంటు అధికారులు అదుపులోకి తీసుకున్నారు. బుధవారం సాయంత్రం నిజామాబాద్ నగరంలోని కృష్ణమందిరం నుంచి బైపాస్ వెళ్లే రోడ్డులో ఇద్దరు గంజాయి విక్రయిస్తున్నట్టు సమాచారం రావడంతో ఎక్సైజ్ అధికారు లు అక్కడికి చేరుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు. వారిని నగరానికి చెందిన ఇర్ఫాన్‌ఖాన్, మహ్మద్ యూనస్‌గా గుర్తించారు. వారి నుంచి  6.1కిలోల ఎండు గంజాయి, రెండు ద్విచక్రవాహనాలు, మూడు సెల్‌ఫోన్లు, రూ.10వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.