27-03-2025 04:58:10 PM
ఆదిలాబాద్ (విజయక్రాంతి): జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించిన, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఆదిలాబాద్ వన్ టౌన్ సీఐ సునీల్ కుమార్ తెలిపారు. బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించిన ఇద్దరికి గురువారం ఆదిలాబాద్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ గుండ రామస్వామి 600 చొప్పున జరిమానా విధించినట్లు సీఐ తెలిపారు. ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు చోటు చేసుకోకుండా పకడ్బందీగా పెట్రోలింగ్ వ్యవస్థను అమలుపరుస్తున్నట్లు తెలిపారు. ఎలాంటి అత్యవసర పరిస్థితుల్లోనైనా డయల్ 100 కి సంప్రదించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.