calender_icon.png 30 April, 2025 | 7:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇద్దరు విద్యార్థినులు మృతి

30-04-2025 12:00:00 AM

  1. మరో ఐదుగురు విద్యార్థినిలకు  గాయాలు 

జిల్లా ఆసుపత్రి సందర్శించిన ఎమ్మెల్యే, కలెక్టర్ 

గద్వాల, ఏప్రిల్ 29 ( విజయక్రాంతి )  నర్సు లు అయ్యి పెద ప్రజలకు వైద్య సేవలను అందించాలని లక్ష్యం తో ముందుకు వెళుతున్న ఇద్దరు విద్యార్థినిలకు రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు ఒడికి చేరుకున్నారు.  జిల్లా కేంద్రంలో మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు నర్సింగ్ విద్యార్థులు దుర్మరణం చెందగా మరో ఐదుగురికి గాయాలయ్యాయి.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారంగా నర్సింగ్ కళాశాల వదిలిన తర్వాత విద్యార్థినిలు వారి వారి గమ్యస్థానాలు చేరుకోవడానికి కొత్త హోసింగ్ బోర్డు కాలనీ సమీపంలో మలుపు వద్ద బస్సు కోసం ఎదురుచూస్తున్నారు.  ఈ క్రమంలో వేగంగా వచ్చిన బొలెరో వాహనం నిలిచిన విద్యార్థులను బలంగా ఢీకొట్టడంతో అదే వేగంతో ఇద్దరు విద్యార్థినిలు  అక్కడున్న విద్యుత్ స్తంభాల ఢీకొట్టడంతో విద్యుత్ వైర్లు తెగి విద్యార్థినిలపై  పడ్డాయి.

మక్తల్ కు చెందిన మహేశ్వరి (20), వనపర్తికి చెందిన మనిషా శ్రీ (21) లు మృతి చెందారు. గాయపడిన విద్యార్థినిలను స్థానిక ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ సంతోష్, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి లు గాయపడ్డ వారిని పరామర్శించి వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు.