04-04-2025 12:00:00 AM
నాగర్ కర్నూల్ ఏప్రిల్ 3 (విజయక్రాంతి): పిడుగుపాటు గురై ఇద్దరు మహిళా కూలీలు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లా పదర మండలం కోడోనిపల్లి గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెం దిన సుంకరి సైదమ్మ (40), గాజుల వీరమ్మ (55), సుంకరి లక్ష్మమ్మతో పాటు మరికొందరు అదేగ్రామానికి చెందిన ఓ రైతు పొలంలో కూలీలుగా వెళ్లారు.
మధ్యాహ్నం వర్షం కురుస్తుందని అందరూ పక్కనే ఉన్న ఒక చెట్టు కింద నిలుచున్నారు. ఒక్కసారిగా పిడుగుపాటుకు సైదమ్మ, వీరమ్మ అక్కడికక్కడే మృతిచెందగా లక్ష్మమ్మ తీవ్రంగా గాయపడింది. వెంటనే గ్రామస్తులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.