15-04-2025 12:00:00 AM
సీఎస్‌ఆర్ కింద అందజేసిన ఎస్‌బీఐ
యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 14 ( విజయక్రాంతి): కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్) కింద యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి రెండు ఎలక్ట్రిక్ వాహనాలను విరాళం ఇచ్చారు. ఎలక్ట్రిక్ వాహనాలను విరాళంగా ఇవ్వడం ద్వారా సమాజ సంక్షేమం పట్ల ఎస్బిఐ నిబద్ధతను ప్రదర్శించారు.
ఈ వాహనాలు ఆలయాన్ని సందర్శించే వృద్ధులు, మహిళలు, వికలాంగులకు సహాయకారిగా ఉంటాయని ఆయన అన్నారు. సమాజంలోని విభిన్న సమూహాల అవసరాలను తీర్చడంలో, సమ్మిళితత్వాన్ని పెంపొందించడంలో ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగకరంగా ఉంటాయని చెప్పారు. సమాజ శ్రేయస్సుకు దోహదపడటంలో ఎస్బిఐ పాత్ర పట్ల ఆనందం వ్యక్తం చేశారు.
హైదరాబాద్ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ రాజేష్కుమార్ మాట్లాడుతూ.. సమాజ ఉపయోగకర కార్యక్రమాలు చేయండంలో ఎస్బిఐ ముందుంటుందని చెప్పారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వాహక అధికారి ఏ భాస్కర రావు.. ఎస్బిఐ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్ జీ రామకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.