ఆదిలాబాద్, అక్టోబర్ 6 (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు దుర్మరణం చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా ఆదిలాబాద్ నుంచి మహారాష్ర్టలోని కేలాపూర్‌లో గల శ్రీ జగదాం బ దరనానికి ఆదిలాబాద్‌కు చెంది న ఇద్దరు యువకులు హరవరన్, నీరజ్‌రెడ్డి శనివారం రాత్రి దిచక్ర వాహనంపై వెళ్లారు.
అమ్మవారిని దరించుకుని తిరుగు ప్రయాణంలో ఆదివారం తెల్లవారుజాము న జైనథ్ మండలం పిప్పర్ వాడ టోల్ ప్లాజా వద్ద జాతీయ రహదారిపై రోడ్డు పక్కన నిలిచి ఉన్న లారీ ని ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో హరవరన్ (18) అక్కడికక్కడే మృతిచెందగా, నీరజ్‌రెడ్డి తలకు తీవ్ర గాయాలయ్యాయి.
అదేవిధం గా ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మం డలంలోని జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. మతి స్థిమితంగా లేని 55 ఏళ్ల గుర్తు తెలియని మహిళను ఆదివారం తెల్లవారుజామున గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.