calender_icon.png 16 January, 2025 | 7:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి దుర్మరణం

04-08-2024 01:09:58 AM

ఆదిలాబాద్, ఆగస్టు 3 (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతిచెందారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న కారు శనివారం తెల్లవారుజామున అతివేగం గా వచ్చి మావల మండల కేంద్ర సమీపంలో జాతీయ రహదారి పక్క న ఉన్న గుంతలో బోల్తా కొట్టింది. కారులో ఉన్న శుభ్రంజు(70) మృతి చెందగా.. ఆమె భర్త సంజీవ్, కారు డ్రైవర్‌కు గాయాలయ్యాయి. గుడిహత్నూర్ మండలంలోని సీతగొంది జాతీయ రహదారిపై ఆ గ్రామానికి చెందిన రాజస్థానీ దాబా యజమాని భీర్ల రవీందర్(47)ను గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో మృతి చెందాడు. ఆదిలాబాద్ రూరల్ మండలం లోకారి గ్రామం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు కుమురం భీం చౌరస్తా వద్ద నడుచుకుంటూ వెళ్తున్న గొడుగుల రమణ(55)ను ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు.