కామారెడ్డి/మణుగూరు, అక్టోబర్ 13 (విజయక్రాంతి): వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు విద్యుదాఘాతం తో మృతి చెందారు. కామారెడ్డి జి ల్లా పాల్వంచ మండలం బండరామేశ్వర్‌పల్లి గ్రామానికి చెందిన శిని గిరి రాజేష్(17) శనివారం సాయం త్రం పొలానికి వెళ్లాడు. రాత్రయినా తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు వెళ్లి చూడగా పొలంలో విగతజీవిగా పడి ఉన్నాడు.
కర్రతో కోతులను వెళ్లగొట్టే ప్రయత్నంలో 11 కేవీఏ విద్యుత్‌లైన్‌కు తాకడంతో షాక్‌కు గురై మృతిచెందినట్టుగా పోలీసులు నిర్ధారించారు. కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు మాచారెడ్డి ఎస్సై అనిల్ తెలిపారు. కాగా విద్యుత్ శాఖ నిర్లక్ష్యం వల్లనే రాజే ష్ మృతిచెందినట్లు గ్రామస్థులు ఆరోపించారు. వైర్లు కిందికి ఉండటంతోనే రాజేష్ మృతిచెందాడన్నా రు.
స్తంభాలు ఏర్పాటు చేయాలని కోరినా విద్యు త్‌శాఖ అధికారులు పట్టించుకోలేదన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం గిన్నెలగూడెం గ్రామానికి చెంది న బిజ్జా రజిత(35) శనివారం ఇంట్లో ఉన్న హీటర్‌కు ప్రమాదవశాత్తు తగలడంతో విద్యుత్‌షాక్ గురై మృతి చెందింది. మృతురాలికి భర్త, ము గ్గురు పిల్లలు ఉన్నారు. బయ్యారం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.