calender_icon.png 5 January, 2025 | 2:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్తంభాన్ని ఢీకొట్టిన బైక్‌: ఇద్దరు స్పాట్ డెడ్

07-12-2024 12:23:26 PM

హైదరాబాద్: నగర శివార్లలోని పేట్‌బషీరాబాద్ వద్ద శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. మృతులు కార్తీక్ రెడ్డి (23), అనిల్ (23)గా గుర్తించారు. వీరు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనం అతివేగంతో విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సంఘటన శనివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో గుండ్ల పోచంపల్లి రోడ్డు వద్ద చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. వీరిద్దరు అతివేగంతో వాహనం నడపడం వల్లే మోటార్‌సైకిల్‌పై నియంత్రణ తప్పి ఈ ఘటనకు దారితీసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.