calender_icon.png 19 April, 2025 | 12:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెండు రోజులు వర్షాలు

11-04-2025 12:29:19 AM

 పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ

హైదరాబాద్, ఏప్రిల్ 10 (విజయక్రాంతి): వచ్చే రెండు రోజులు.. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

ఆ తర్వాత కూడా మూడు రోజులపాటు ఇదే పరిస్థితి ఉంటుందని.. అయితే ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు పెరుగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా రాబోయే రెండు రోజులు (శుక్ర, శనివారాలు) తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్న కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్డ్ జారీచేశారు.

అటు తరువాత (ఆదివారం) నుంచి మూడు రోజులపాటు అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉన్నా.. ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ పరిస్థితి ఈనెల 17 తారీఖు వరకు ఉండే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా.. గురువారం రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిశాయి. అత్యధికంగా 4.1 సెం.మీ. వర్షం సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్‌లో కురిసింది. అలాగే నల్లగొండ జిల్లా గుర్రంపోడులో 2.9 సెం.మీ., భువనగిరి జిల్లా శరాజ్‌పేట, కామారెడ్డి జిల్లా బిచ్కుందలో 2 సెం.మీ చొప్పున వర్షం కురిసింది. హైదరాబాద్ నగరంలోనూ చిరు జల్లులు కురిశాయి. అత్యధికంగా సఫిల్‌గూడలో ఒక సెం.మీ. వర్షం పడింది.