26-02-2025 12:00:00 AM
సీఎంతో చర్చించి నిధులను విడుదల చేయించిన ఎమ్మెల్యే రోహిత్
మెదక్, ఫిబ్రవరి 25(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ ఏడుపాయల వన దుర్గాభవాని దేవస్థానం మహాశివరాత్రి జాతర ఉత్సవాలకు ప్రభుత్వం నుండి అదనంగా మరో రూ.2 కోట్ల నిధులను తీసుకువచ్చినట్లు మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ మంగళవారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 26వ తేదీ నుండి జరగనున్న ఏడుపాయల మహా శివరాత్రి జాతర ఉత్సవాలకు దాదా పు 15 లక్షల నుండి 20 లక్షల మంది రాను న్న నేపథ్యంలో భక్తులకు ఏలాంటి అసౌకర్యాలు కల్గకుండా ఉండేందుకు ముందు చూపుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళి మరో 2 కోట్ల రూపాయలు అదనంగా నిధులను తీసుకువచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. కాగా జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.