calender_icon.png 23 October, 2024 | 7:49 AM

విద్యాశాఖలో 1.96 కోట్లు గోల్‌మాల్

12-09-2024 02:04:00 AM

  1. ఖమ్మం సర్వశిక్షా అభియాన్‌లో అవినీతి 
  2. అవుట్ సోర్సింగ్ ఉద్యోగిపై కేసు 
  3. విధుల నుంచి తొలగింపు 
  4. రూ.50 లక్షలు రికవరీ 
  5. ఇంకొందరిపై అనుమానాలు

ఖమ్మం, సెప్టెంబర్ 11 (విజయక్రాంతి): ఖమ్మం విద్యాశాఖలో 2023 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.1.96 కోట్లు గోల్‌మాల్ అయినట్లు ప్రచారం జరుగుతుండటంతో అధికారులపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలకు తిలోదకాలిచ్చి ఉపాధ్యాయులకు అక్రమ డిప్యూ టేషన్లు వేసినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న విద్యాశాఖలో తాజాగా మరో అవినీతి కుంభకోణం వెలుగులోకి వచ్చింది. విద్యాశాఖకు సంబంధించిన సర్వశిక్షా అభియాన్‌లో పెద్దఎత్తున అవినీతి జరిగినట్లు ఆరోపణలున్నా యి. జిల్లా విద్యాధికారి కళ్లుగప్పి దాదాపు రూ.1.96 కోట్లు కొందరు ఉద్యోగులు మా యం చేసినట్లు తెలిసింది. 

అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి బాధ్యతలు

సర్వశిక్ష అభియాన్‌లో మౌళిక వసతులు, ఇతర పనుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు ఏటా నిధులు మంజూరు చేస్తుంటాయి. ఈ నిధులను జిల్లా విద్యాధికారి పర్యవేక్షణ లో ఖర్చు చేయాల్సి ఉంటుంది. కానీ ఖమ్మ ంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి నిధులు ఖర్చు చేసే బాధ్యత అప్పగించడంపై పలు అ నుమానాలు వ్యక్తమవతున్నాయి.

2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నిధులు గోల్‌మాల్ చేసినట్లు తెలిసింది. విద్యాశాఖలోని అకౌంట్ విభాగంలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పని చేస్తున్న వ్యక్తి ఈ నిధులను కాజేసినట్లు ఆరోపణలున్నాయి. ఇదంతా డీ ఈవోకు తెలియకుండానే జరిగిందని పలువురు అంటున్నారు. విచారణ తర్వాతే అస లు నిజం తెలిసే అవకాశముంది. 

డీఈవో సంతకం ఫోర్జరీ

జిల్లా విద్యాధికారి సంతకాన్ని సదరు కాం ట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఫోర్జరీ చేసి నకిలీ అకౌంట్లు తెరిచి రూ.1.96కోట్లు కాజేసినట్లు ఆరోపణలున్నాయి.  ఇందులో మరి కొంత మంది హస్తం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. సదరు అవుట్ సోర్సింగ్ ఉద్యోగిపై ఖమ్మం త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు కూడా నమోదైంది. అతడి నుంచి రూ.50 లక్షలు రి కవరీ చేశారని తెలిసింది. ప్రస్తుతం అవుట్ సోర్సింగ్ ఉద్యోగిని విధుల నుంచి తప్పించినట్లు తెలిసింది.

జూలైలోనే కుంభకోణం 

గత జూలై నెలలోనే ఈ కుంభకోణం జరిగినా బయటకు తెలియకుం డా జాగ్రత్తపడినట్లు తెలిసింది. అయితే కాంట్రాక్ట్ ఉద్యోగికి నిధుల ఖర్చు బా ధ్యత అప్పగించడం పై అనుమానాలు వ్యక్తమవుతున్నా యి. అకౌంట్ సెక్షన్ లోని మరికొంతమంది హస్తం కూడా ఉన్నదని తెలుస్తున్నది. వరదల నేపథ్యంలో ఈ విచారణ మరుగున పడిం ది. ఉన్నతాధికారులు విచారించి, అవినీతి వెను క ఉన్న అసలు దొంగలెవరో తేల్చాలని ప్రజలు కోరుతున్నారు.