calender_icon.png 13 January, 2025 | 5:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గజ్వేల్‌లో హిట్ అండ్ రన్.. కానిస్టేబుల్స్ మృతి

08-12-2024 11:25:01 AM

హైదరాబాద్: సిద్దిపేట జిల్లా జాలిగామ వద్ద గజ్వేల్ బైపాస్ రోడ్డుపై ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వాహనం బైక్‌ను ఢీకొట్టడంతో ఇద్దరు కానిస్టేబుళ్లు మృతి చెందారు. మృతులను పరందాములు (43), పూసా వెంకటేశ్వర్లు (42)గా గుర్తించారు. 2004 బ్యాచ్ కానిస్టేబుల్ పరందాములు రాయపోల్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తుండగా, 2007 బ్యాచ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు దౌల్తాబాద్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్నారు. మారథాన్‌లో పాల్గొనేందుకు ఈసీఐఎల్‌కు వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం వీరి వాహనాన్ని ఢీకొట్టింది. తీవ్ర గాయాలపాలైన వీరిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వాహనాన్ని గుర్తించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.