15-03-2025 08:28:14 PM
అశ్వారావుపేట (విజయక్రాంతి): మండలంలో కుటుంబ కలహాల నేపథ్యంలో శనివారం వేర్వేరు ఘటనల్లో ఇద్దరు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఎస్ఐ యయాతిరాజు తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని వినాయకపురం గ్రామానికి చెందిన తోట సన్యాసమ్మ (45)కు తన కుతూరుకు కొంతకాలంగా గొడవలు అవుతున్నాయి. ఇదే తరుణంలో ఇద్దరి మధ్య శుక్రవారం రాత్రి కూడా మరోసారి వాగ్వాదం జరిగింది.
దీంతో మనస్థాపం చెందిన సన్యాసమ్మ శనివారం తెల్లవారుజామున ఇంటివద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. మరో ఘటనలో అశ్వారావుపేటలోని ఫైర్ కాలనీకి చెందిన ఎస్.మాణిక్యాలరావు(35)కు బార్య సుధారాణి మధ్య తరచుగా కలహాలు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో మాణిక్యాలరావు శనివారం ఉదయం ఇంటివద్దే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతదేహాలకు పోస్టుమార్గం నిర్వహించి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ యయాతి రాజు తెలిపారు.