calender_icon.png 2 February, 2025 | 7:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నీటి గుంటలో ఇద్దరు చిన్నారుల గల్లంతు

02-02-2025 12:01:22 AM

జడ్చర్ల, ఫిబ్రవరి 1: జడ్చర్ల మండలం ఉదండపూర్ గ్రామ శివారులోని పాలమూ రు ఎత్తిపోతల పథకం ఉదండా పూర్ రిజర్వయర్ ప్రాజెక్టు నీటి గుంటలో ఇద్దరు చిన్నారులు గల్లంతు అయ్యారు. ఉదండ పూర్ గ్రామానికి చెందిన భాగ్యలక్ష్మి (6), మహేష్ (4)అనే ఇద్దరు చిన్నారులు ఆడు తున్న క్రమంలో అదుపు తప్పి నీటి గుంట లో పడ్డారు.

దీన్ని చిన్నారుల తల్లిదండ్రులు గుర్తించే లోగ ఇద్దరు చిన్నారులు నీటి మునిగిపోయారు. ఈ విషయాన్ని తెలుసు కున్న చుట్టుపక్కల వారు వెంటనే నీటి గుంటలో దిగి చిన్నారుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు. వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని  నీటి గుంటలో నుంచి బాలుడిని బయటకు తీసి, మరో చిన్నారి కోసం గా లీస్తున్నట్లు సీఐ ఆదిరెడ్డి తెలిపారు.