- ఆరు తులాల బంగారం, బైక్ స్వాధీనం
జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్‌రెడ్డి
మెదక్, ఫిబ్రవరి 4 (విజయక్రాంతి): జల్సాలకు, బెట్టింగ్లకు అలవాటు పడి డబ్బుల కోసం ద్విచక్ర వాహనాలను ఆపి చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న ఇద్దరు యువకులను పట్టుకొని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్రెడ్డి తెలిపారు. డీఎస్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ మెదక్ పట్టణానికి చెందిన మహ్మద్ అబ్దుల్ ఖాదిర్.
మహ్మద్ అబ్దుల్ షఫి అనే ఇద్దరు వారి స్నేహితుడైన మహ్మద్ హఫీజ్ వద్ద బైక్ తీసుకొని చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్నట్లు తెలిపారు. సోమవారం సాయంత్రం ఔరంగాబాద్ శివారులో వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా బ్పై వస్తున్న ఇద్దరిని ఆపే ప్రయత్నం చేయగా తప్పించుకొని పారిపోయారు.
పోలీసులు వారిని వెంబడించి హవేళీ ఘణపూర్లో విచారణ చేయగా మండల పరిధిలోని ముత్తాయికోట, జక్కన్నపేట, బూరుగుపల్లి శివారులో చైన్ స్నాచింగ్లకు పాల్పడినట్లు తెలిపారు. వారి నుండి ఆరు తులాల బంగారం, రెండు హెల్మెట్లు, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
అలాగే కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం సీతారాంపూర్, రాజంపేట, భిక్కనూర్ మండలం జంగంపల్లి శివారులో ఆరు తులాల బంగారాన్ని చైన్ స్నాచింగ్ చేసినట్లు తెలిపారు.
కామారెడ్డిలో దోచుకున్న బంగారాన్ని హైదరాబాద్లోని వాల్యూ గోల్డ్లో అమ్మగా వచ్చిన 2,08,293 నగదును చెరిసగం పంచుకున్నట్లు తెలిపారు. వాల్యూ గోల్ వారికి కూడా నోటీస్ ఇచ్చామని, దాన్నికూడా రికవరీ చేస్తామని ఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో డీఎస్పీ ప్రసన్న పాల్గొన్నారు.