ఇవాళ పుట్టినరోజు జరుపుకొంటున్నవారిలో ఇద్దరు సెలబ్రిటీలు టాలీవుడ్‌కు సుపరిచితులు. దర్శకుడు తరుణ్ భాస్కర్, హీరోయిన్ మెహ్రీన్ ఫిర్జాదాకు జన్మదిన శుభాకాంక్షలు...
వరంగల్‌కు చెందిన తరుణ్ భాస్కర్ 1988 నవంబర్ 5న జన్మించారు. దర్శకుడిగా సినీరంగ ప్రవేశం చేసినా కూడా నటుడిగానూ రాణిస్తున్నారు. ఇప్పటివరకు దర్శకుడిగా ఆరు చిత్రాలను రూపొందించారు. 12 చిత్రాల్లో నటుడిగా రాణించారు. ‘ద జర్నీ’ అనే లఘు చిత్రానికి తొలిసారిగా తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించారు. ‘పెళ్లి చూపులు’తో దర్శకుడిగా తొలిసారిగా సినీరంగ ప్రవేశం చేశారు.
ఈ చిత్రానికి రెండు జాతీయ పురస్కారాలు అందుకున్నారు. ‘ఈ నగరానికి ఏమైం ది’, ‘కోడా కోలా’ చిత్రాలకు దర్శకత్వం వహించారు. ‘మహానటి’ చిత్రంలో తొలిసారిగా ఆయన నటించారు. ఆ తర్వాత ‘సమ్మోహనం’, ‘ఫలక్‌నుమా దాస్’, ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’, ‘సీతారామం’ వంటి చిత్రాల్లో తరుణ్ భాస్కర్ నటించి మెప్పించారు. కొన్ని చిత్రాలకు స్క్రీన్‌ప్లే కూడా చేశారు.
మెహ్రీన్ ఫిర్జాదా 1995 నవంబర్ 5న పంజాబ్‌లోని భటిండాలో జన్మించారు. కృష్ణ గాడి వీర ప్రేమ గాధ చిత్రంతో సినీరంగ ప్రవేశం చేశారు. తెలుగు సినీ పరిశ్రమ ఆమెను బాగానే ఆదరించింది. ఎక్కువ సినిమాలు, హిట్ సినిమాలు తెలుగులోనే చేశారు. ‘మహానుభావుడు, రాజా ది గ్రేట్, జవాన్, పంతం, ఎంత మంచివాడవురా, మంచి రోజులు వచ్చాయి’ వంటి చిత్రాల్లో నటించి మెప్పించారు.