26-03-2025 10:56:35 AM
మరో ఇద్దరు నేతలపై సైతం
నల్లగొండ: మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR)తోపాటు మరో ఇద్దరు ఆపార్టీ నేతలపై నల్గొండ జిల్లా నకిరేకల్ పీఎస్‌లో కేసులు నమోదైనట్లు సమాచారం. నకిరేకల్ పట్టణంలో పదో తరగతి తెలుగు పరీక్ష ప్రశ్నపత్రం లీక్ అయిందంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారంటూ కేటీఆర్‌పై మున్సిపల్ చైర్‌పర్సన్ చౌగోని రజిత, పలువురు కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేసినట్లు తెలిస్తోంది.
ఈ మేరకు నకిరేకల్ పోలీసులు కేటీఆర్‌తో పాటు బీఆర్ఎస్ సోషల్ మీడియా(BRS Social Media) ఇన్చార్జి మన్నె క్రిశాంక్, కొణతం దిలీప్ కుమార్‌పై వేర్వేరుగా కేసులు నమోదు చేసినట్లు తెలిసింది. పదో తరగతి ప్రశ్నపత్రం లీక్(10th Class question paper leaked) అయిందంటూ వెబ్‌సైట్‌లో వచ్చిన వార్తను వాస్తవాలు తెలుసుకోకుండా కేటీఆర్ ట్విట్టర్లో షేర్ చేశారని ఫిర్యాదుదారులు ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిసింది. పేపర్ లీకేజీ వ్యవహారంలో పోలీసులు ఇప్పటికే ఆరుగురిని అరెస్ట్ చేశారు. మరో ఆరుగురు పరారీలో ఉన్నారని వెల్లడించారు. పోలీసులను వివరణ కోరేందుకు ప్రయత్నించగా స్పందించడం లేదని సమాచారం.