22-04-2025 01:05:02 AM
ముగ్గురు మృతి...ఆరుగురికి గాయాలు
మెదక్, ఏప్రిల్ 21(విజయక్రాంతి):మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందారు. ఈ సంఘటన ఆదివారం అర్ధరాత్రి జరిగింది. వివరాల్లోకి వెళ్తే..హైదరాబాద్ షాపూర్కు చెందిన 9 మంది కారులో మెదక్ వైపు వెళ్తున్నారు.
కౌడిపల్లి మండలం వెంకట్రావ్పేట గేటు వద్దకు రాగానే రాయిలాపూర్ గ్రామానికి చెందిన హరీష్రెడ్డి నర్సాపూర్ వైపు తన కారులో వెళ్తుండగా ఎదురెదురుగా వేగంగా వచ్చి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో షాపూర్నగర్కు చెందిన మహ్మద్ అలీ(45), అజీమా బేగం(40), ఏడాది వయస్సు ఉన్న చిన్నారి అక్కడికక్కడే మృతి చెందారు.
అలాగే కారులో ఉన్న సహనాబేగం, ఇరాన్ షాహిమ్, హలీమా, మహమ్మద్, చిన్నారులు నీలోఫర్, జూనెరలకు తీవ్ర గాయాలు అయ్యాయి. వీరిని హైదరాబాద్లోని ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకు న్న జిల్లా ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి, డీఎస్పీ వెంకట్రెడ్డి, సీఐ జాన్రెడ్డి, ఎస్‌ఐ రంజిత్రెడ్డి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.