30-04-2025 12:43:14 AM
ఖమ్మం, ఏప్రిల్ 29 ( విజయక్రాంతి ):- ఖమ్మం జిల్లా జూలూరుపాడు మండలం వినోభా నగర్ గ్రామ సమీపంలో మంగళవారం రెండు కార్లు ఎదురెదురుగా వేగంగా వచ్చి ఢీకొన్న ఘటనలో ఎడుగురు గాయపడ్డారు. ఖమ్మం వైపు నుంచి భద్రాచలం కారులో వెళుతున్న దక్షిణ కొరియా టూరిస్టులున్న కారును ఎదురుగా వచ్చిన మరో కారు ఢీకొనడం తో ఈ ప్రమాదం సంభవించింది.
ఈ ప్రమాదం లో దక్షిణ కొరియా కు చెందిన నలుగురు పర్యాటకులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను కొత్తగూడెం ప్రభుత్వ అస్పత్రికి తరలించారు.స్థానిక పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.