యాదాద్రి భువనగిరి (విజయక్రాంతి): యాదాద్రి జిల్లా మూటకొండూరు మండలం అమ్మనబోలు గ్రామంలోని అబిద్‌నగర్ లో విషాదం చోటు చేసుకుంది. సరదా కోసం ఊరికి వెళ్లిన విద్యార్థులు ఇద్దరు పక్కనే ఉన్న చెరువులో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు ఇద్దరు మృతి చెందారు. మృతులు శశి, చరణ్ గా పోలీసులు గుర్తించారు. మృతులు బోడుప్పల్, ఉప్పల్ వాసులుగా పోలీసులు గుర్తించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.