calender_icon.png 6 April, 2025 | 2:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రాణాలు తీసిన వేసవి ఆట సరదా...

05-04-2025 10:21:56 PM

నీటి కుంటలో మునిగి ఇద్దరు బాలుర దుర్మరణం...

ఆదిలాబాద్ (విజయక్రాంతి): వేసవి కాలం వచ్చిందంటే చాలు చిన్నారులు, యువకులు తమ గ్రామాల్లోని చెరువులు, కుంటలు, వాగులో ఈతకు వెళ్లి సరదాగా గడుపుతుంటారు. ఈ సరదా ఆటనే ఇద్దరి బాలుర ప్రాణాలు తీసిన విషాద ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. మావల మండల కేంద్రం లోని నీటి కుంటలో ప్రమాదవశాత్తు పడి గల్లంతైన ఇద్దరు బాలుర మృతదేహాలు లభ్యమైయ్యాయి. శనివారం నీటి కుంటలో స్నానానికి వెళ్లిన ముగ్గురు బాలురు లో సంజీవ్(12) రాహుల్ (11) ఇద్దరు నీటి కుంటలో దిగగా స్నానం చూస్తుండగా ప్రమాదవశాత్తు నీటి కుంటలో గల్లంతయ్యారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా ఘటన స్థలానికి చేరుకున్న మావల ఎస్ఐ విష్ణువర్ధన్ ఈతగాళ్ల తో గాలింపు చర్యలు చేపట్టి, ఇద్దరు బాలుర మృతదేహాలను వెలికి తీశారు. బాలుర మృతితో వారి కుటుంబంలో విషాదం నెలకొంది. ఘటన విషయం తెలుసుకున్న డీఎస్పీ జీవన్ రెడ్డి సంఘటన స్థలానికి వెళ్లి ప్రమాదంపై ఆరా తీశారు.