03-03-2025 10:51:11 PM
కాటారం/భూపాలపల్లి (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి మండలం రాంపూర్ కమలాపూర్ మార్గమధ్యంలో సోమవారం రాత్రి ఘోర ప్రమాదం సంభవించింది. రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొట్టడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులలో మహ ముత్తారం మండలం మీనాజీపేటకు చెందిన పింగిలి రాజిరెడ్డి, లడ్డుగా గుర్తించారు. మరొకరు పంబపూర్ కు చెందిన సతీష్ గా గుర్తించారు. ఈ ప్రమాదంకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.