calender_icon.png 9 March, 2025 | 10:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అగ్ని ప్రమాదంలో రెండు బైకులు దగ్ధం

07-03-2025 12:52:15 PM

షార్ట్ సర్క్యూట్ తో ప్రమాదం!

రాజేంద్రనగర్, (విజయ క్రాంతి): అగ్ని ప్రమాదంలో రెండు బైకులు పూర్తిగా కాలిపోయాయి. మైలార్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్(Mailardevpally Police Station) పరిధిలోని గవర్నమెంట్ స్కూల్ సమీపంలో ఈ ఘటన శుక్రవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బైక్ రిపేర్ షాప్ లో ఒక్క సారిగా మంటలు చెలరేగడంతో రెండు బైకులు పూర్తిగా కాలిపోయాయి. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.