21-02-2025 01:14:36 AM
హైదరాబాద్, ఫిబ్రవరి 20 (విజయక్రాంతి): తెలంగాణ బార్ కౌన్సిల్ కు చెందిన ఇద్దరు సభ్యులు గండ్ర మో హన్‌రావు, బీ శంకర్ బార్ కౌన్సిల్ సభ్యత్వ పదవులకు రాజీనామా చేశారు. ఈ మేరకు గురువారం రాజీనా మా లేఖను బార్ కౌన్సిల్ చైర్మన్ ఏ నరసింహారెడ్డికి అందజేశారు.
ఇప్పటికే బార్ కౌన్సిల్ పాలకమండలికి ఐదేళ్ల కాల పరిమితి ముగిసిందని, ఆ గడువు ముగిసి ఏడాది కాలం గడిచిపోయిందని, వెంటనే పాలకవర్గానికి ఎన్నికలు నిర్వహించాలని వారిద్దరూ చైర్మన్‌ను కోరారు.