హర్షం వ్యక్తం చేసిన ఆ సంస్థ ఎండీ కేవీబీరెడ్డి
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 13(విజయక్రాంతి): పబ్లిక్ రిలేషన్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(పీఆర్సీఐ) ఆధ్వర్యంలో నిర్వహించిన 18వ గ్లోబల్ కమ్యూనికేషన్స్‌లో ఉత్తమ ఇంటర్నల్ కమ్యూనికేషన్స్ క్యాంపెయిన్, బెస్ట్ సోషల్ మీడియా క్యాంపెయిన్ విభాగంలో ఎల్అండ్టీ మెట్రో రైలు సంస్థకు రెండు పురస్కారాలు దక్కాయి. అవార్డులు వరించడం పట్ల ఎల్అండ్టీ మెట్రో రైలు ఎండీ, సీఈవో కెవీబీ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
తమ సంస్థను ప్రభావవంతంగా తీర్చిదిద్దడంలో ఉన్న చిత్తశుద్ధికి ఈ అవార్డులు నిదర్శనమని ఎల్అండ్టీ మెట్రో రైల్ చీఫ్ స్ట్రాటెజీ ఆఫీసర్ మురళీ వరదరాజన్ పేర్కొన్నారు. ఢిల్లీలో జరిగిన అవార్డుల కార్యక్రమంలో మెట్రో అధికారులు అవార్డులను అందుకున్నట్లు తెలిపారు.