calender_icon.png 18 March, 2025 | 5:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సినీ పక్కిలో మహిళను దోపిడీ చేసిన ఇద్దరి అరెస్టు రిమాండ్

17-03-2025 08:18:47 PM

ఆటోతో పాటు బంగారు నగలు స్వాధీనం...

48 గంటల్లో కేసును చేదించిన నిజాంసాగర్ పోలీసులు..

నిజాంసాగర్ (విజయక్రాంతి): బస్సు కోసం వేచి ఉన్న మహిళను ఆటోలో ఎక్కించి అచ్చంపేటకు తీసుకెళ్తామని నమ్మించి నగలు దోపిడీకి పాల్పడిన ముఠాను సోమవారం నిజాంసాగర్ పోలీసులు పట్టుకున్నారు. ఈనెల 15 న మేదరి భూమవ్వ తన కూతురు ఇంటికి అచ్చంపేట వెళ్ళుటకు నిజాంసాగర్ బస్టాండ్ నందు ఆటో గురించి వేచి ఉండగా ఒక ఆడమనిషి ఒక మగ మనిషి ఇద్దరు ఒక ఆటోలో వచ్చి బస్టాండ్ ముందర ఆగి ఉన్నారు. అప్పుడు భూమవ్వ ఆటో అచ్చంపేట వెళ్తుందా అని అడిగి ఆటోలో వెళ్ళగా ఆటోలో ఉన్న వ్యక్తులు భూమవ్వను నేషనల్ హైవే 161 బాచేపల్లి శివారులోకి తీసుకెళ్లి బలవంతంగా ఆమె మెడలో నుండి బంగారం పుస్తే గుండ్లు, చెవి నాగులు చేతి వెండి రెట్ట కడియాలు దొంగిలించుకుని పారిపోయిన సంఘటన విధమే. నిజాంసాగర్ ఎస్ఐ శివకుమార్ బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. ఆటోలో మహిళను తీసుకెళ్లి ఆమె ఒంటిపై ఉన్న బంగారు, వెండి నగలను ఎత్తుకెళ్లిన విషయం విధితమే సోమవారం బాన్సువాడ రూరల్ సి సీఐ రాజేష్ తన సిబ్బందితో బగ్గు గుడిసే ఎక్స్ రోడ్లో వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక ఆటో అక్కడి నుంచి పోలీసులను చూసి పారిపోతుండగా పట్టుకొని వారికి విచారించగా అందులో ఉన్న ఫోలో జాక్సన్ సుందరరాజు వడ్డే లక్ష్మి రోజులాగే శ్రీరామ్ సాగర్ బస్టాండ్ వద్ద ఆటోల్లో వచ్చి ఒక ముసలి ఆడమనిషి బాచేపల్లి చివరకు తీసుకెళ్లి ఆమె దగ్గర ఉన్న బంగారు దొంగలను దొంగలించమని పోలీసుల విచారణలో ఒప్పుకున్నారు, తమ దొంగలించిన వెండి బంగారు అభరణాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటితో పాటు ఆటో కూడా జట్టు చేశారు ఇద్దరు నేరస్తులను కోటు నందు హాజరు పరిచినట్లు రూరల్ రాజేష్ తెలిపారు. ఈ కేసు చేతనలో ప్రతిభ ఘనపరిచిన నిజాంసాగర్ ఎస్సై శ్యామ్ మహేష్ లను బాన్సువాడ రూరల్ సీఐ అభినందించారు.

రోజు బాన్సువాడ రూరల్ సీఐ శ్రీ టి రాజేష్ తన సిబ్బందితో బొగ్గు గుడిసె ఎక్స్ రోడ్ నందు వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక ఆటో అక్కడి నుండి పోలీసులను చూసి పారిపోతుండగా పట్టుకొని వారిని విచారించగా అందులో ఉన్న పోలో జాక్సన్ సుందర్ రాజు, వడ్డే లక్ష్మిలు ఈ రోజులాగే 15వ తేదీ నాడు నిజాంసాగర్ నకు ఆటోలో వచ్చి ఒక ముసలి ఆడమనిషిను బచేపల్లి శివారుకి తీసుకెళ్లి, ఆమె దగ్గర నుండి బంగారము వెండి దొంగిలించినామని  ఒప్పుకొన్నారు, తాము దొంగిలించిన వెండి బంగారు ఆభరణాలు పోలీసు వారు స్వాధీనం చేసుకోవడం జరిగింది. వాటితో పాటు ఆటో కూడా జప్తు చేయడమైనది. ఇద్దరు నేరస్తులను కోర్టు నందు హాజరు పరిచారు. ఇట్టి కేసు చేదనలో ప్రతిభ కనబరిచిన నిజాంసాగర్ ఎస్సై, శ్యామ్, మహేష్ లను బాన్సువాడ రూరల్ సీఐ అభినందించారు.