* మల్లారెడ్డి సోదరుడిపై క్రిమినల్ కేసు
* డైరెక్టర్, ప్రిన్సిపాల్, ఇద్దరు మహిళా వార్డెన్‌లపై కూడా..
మేడ్చల్, జనవరి 5 (విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సీఎంఆర్ హాస్టల్ బాత్‌రూంల వీడియోల కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేయడంతో పాటు కాలేజీ చైర్మన్, డైరెక్టర్, ప్రిన్సిపాల్, ఇద్దరు మహిళా వార్డెన్‌లపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. హాస్టల్‌లోని మెస్‌లో పనిచేసే బీహార్‌కు చెందిన నంద కిషోర్ (20), గోవింద్ కుమార్ (20)పై పలు సెక్షన్‌లతో పాటు పోక్సో చట్టం కింద కేసులు నమోదుచేయడంతో పాటు వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
మొదట ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించగా ఫోరెన్సిక్ నివేదికతో సంబంధం లేకుండానే అనుమానితుల్లో ఇద్దరు వెంటిలేటర్ నుంచి తొంగిచూశామని అంగీకరించారు. విద్యార్థుల ఫిర్యాదుకు స్పందించకపోవడమేగాక, బాత్‌రూం వద్ద మగపనివారికి గదులు కేటాయించినందుకు యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. మాజీమంత్రి మల్లారెడ్డి సోదరుడు, కాలేజీ చైర్మన్ గోపాల్ రెడ్డి (ఏ డైరెక్టర్ జంగా రెడ్డి(ఏ ప్రిన్సిపాల్ అనంత నారాయణ(ఏ వార్డెన్‌లు ధనలక్ష్మీ(ఏ ప్రీతి రెడ్డి(ఏ క్రిమినల్ కేసు నమోదు చేశారు.