18-02-2025 06:16:19 PM
డీఎస్పీ సిహెచ్ నాగేందర్...
ఆదిలాబాద్ (విజయక్రాంతి): గంజాయి సాగుచేస్తున్న, విక్రయిస్తున్న కేసులో ఇద్దరినీ అరెస్టు చేసినట్లు ఉట్నూర్ డిఎస్పి సిహెచ్ నాగేందర్ తెలిపారు. గుడిహత్నూర్ లో ఇచ్చోడ సీఐ భీమేష్, గుడిహత్నూర్ ఎస్ఐ మహేందర్ మంగళవారం వాహనాలు తనిఖీ చేస్తుండగా ఇంద్రవెల్లి మండలం అందు నాయక్ తండా కు చెందిన కపూర్ సింగ్ 6 కిలోల గంజాయిని తరలిస్తు పట్టుబడ్డారు. ఆయన్ని విచారించగా గంజాయి సాగుచేస్తున్న తోయగూడా కు చెందిన తొడసం గోద్రు వద్ద కిలో గంజాయి, రూ. 5వేలు, సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నట్లు డిఎస్పీ తెలిపారు.