14-02-2025 12:17:43 AM
పటాన్ చెరు, ఫిబ్రవరి 13 : అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఎక్సైజ్ సీఐ పరమేశ్వర్ గౌడ్ గురువారం తెలిపారు. అఖిల్, శశాంక్ అనే ఇద్దరు వ్యక్తులు గంజాయి రవాణా చేస్తుండగా పటాన్ చెరు పరిధిలోని లక్డారం చౌరస్తాలో తమ ఎక్సైజ్ పోలీస్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. వారి నుంచి 500 గ్రాముల గంజాయి, రెండు మొబైల్ ఫోన్లు, బైక్ స్వాదీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. ఇద్దరి నిందుతులను అరెస్టు చేసి కోర్టుకు రిమాండ్ చేసినట్లు చెప్పారు.