హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్(secunderabad railway station)లో గంజాయి కలకలం రేపింది. రైళ్లలో గంజాయి తరలిస్తున్న ముఠాను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఇద్దరు యువకులు కోణార్క్ ఎక్స్ ప్రెస్ లో గంజాయి తరలిస్తున్నారు. అంతర్రాష్ట్ర ముఠాను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు(Railway Police) పట్టుకున్నారు. ముఠా నుంచి 17 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు యువకులు విశాఖ నుంచి సోలాపూర్ కు గంజాయి తరలిస్తున్నారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.