calender_icon.png 2 April, 2025 | 1:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లైంగిక దాడికి పాల్పడిన ఇద్దరు అరెస్ట్

01-04-2025 12:44:34 AM

నేరానికి వినియోగించిన స్కూటీ, రెండు సెల్ ఫోన్‌లు స్వాధీనం

వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ  పరితోష్ పంకజ్

సంగారెడ్డి, మార్చి 31 (విజయక్రాంతి): మహిళపై బలవంతంగా అత్యాచారానికి పాల్పడిన వ్యక్తులను అరెస్టు చేశామని సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. సోమవారం సంగారెడ్డి ఎస్పీ కార్యాల యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. మార్చి  24 తేదీన సొంత పనిమీద సంగారెడ్డి పట్టణానికి వెచ్చి,  తిరిగి వారి ఆటోలో ఇంటికి వెళ్లుతుండగా తేదీ 25న రాత్రి  1:00 గంట సమ యంలో సంగారెడ్డి రూరల్ పోలీసు స్టేషన్ పరిధిలో గల మామిడిపల్లి చౌరస్తా వద్ద  మూత్ర విసర్జనకై ఆటోను ఆపగా, అదే సమయంలో తెలుపు రంగు గల స్కూటీపై వచ్చి న ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు బలవంతంగా మహిళను తీసుకెళ్లారని తెలిపారు.  భర్తను కొట్టి, బాధితురాలిని స్కూటీపై నాందేడ్ హైవే పక్కన ఉన్న సర్వీస్ రోడ్డు గుండా నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకొని వెళ్ళి, ఇద్దరు వ్యక్తులు మహీళ పై బలవంతంగా అత్యాచారం చేశారని, సంగారెడ్డి రూరల్ పోలీసు స్టేషన్‌లో  బాధితు రాలు భర్త ఫిర్యాదు చేశారన్నారు. 

 తేది:25 న మధ్యరాత్రి బీర్లు , ఒక వాటర్ బాటిల్ తీసుకొని, మామిడిపల్లి శివారు నాందేడ్ హైవే బ్రిడ్జ్ వద్ద బీర్లు తాగుతుండగా   1:30 గంటల సమయంలో దర్గా సమీపంలో ఒక ఆడ మనిషి ఒంటరిగా కనిపించింది, మద్యం మత్తులో మహీళను చూసి రేప్ చేయాలనుకొని దగ్గరికి వెళ్ళగా అంతలో ఒక మగ వ్యక్తి ఎవ్వరూ మీరు అని అడగగా అతనిని చేతులతో కొట్టగా స్పృహ తప్పి పడిపోగా, మహీళను బలవంతంగా స్కూటి పై ఎక్కింకుకొని, సర్విస్ రోడ్డు పక్కన పొదల మాటుకు నిర్మానుష్య ప్రదేశానికి తీసుకొని వెళ్ళి, పై ఇద్దరు వ్యక్తులు పలు మార్లు రేప్ చేసి, మహీళను వివస్త్రను చేసి, హింసించినట్లు తెలిపారు.పై ఇద్దరు వ్యక్తులను సోమవారం 31న  ఉదయం 7 గంటల కు వారి ఇంటివద్ద అదుపులోనికి తీసుకోవడం జరిగిందన్నారు. 

నేరానికి వినియోగించిన స్కూటీ, 2-సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకొని, రిమాండుకు తరలించడం జరుగుతుందని ఎస్పీ వివరించారు. సంగారెడ్డి జిల్లా ప్రజలకు విజ్ఞప్తి మహిళలు ఒంటరిగా ఉన్న సమయంలో మీ చుట్టూ ఎవరైయన అనుమానస్పదంగా కనిపించిన వెంటనే 100 డైల్ చేయాలని జిల్లా ఎస్పీ  సూచించారు. ఈ సమాజంలో సంగారెడ్డి డి.ఎస్.పి సత్తయ్య గౌడ్ తదితరులున్నారు.