calender_icon.png 22 April, 2025 | 11:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేశీదారు విక్రయిస్తున్న ఇద్దరి అరెస్ట్..

22-04-2025 09:26:17 PM

ఇచ్చోడ (విజయక్రాంతి): మహారాష్ట్రకు చెందిన దేశీదారు లిక్కర్ ను ఆమ్ముతున్నట్టు కచ్చితమైన సమాచారంతో ఎక్సైజ్ పోలీసులు దాడి చేసి ఇద్దరిని అరెస్టు చేశారు. ఎక్సైజ్ ఇన్ స్పెక్టర్ జుల్ఫీకర్ అహ్మద్ తెలిపిన వివరాల ప్రకారం... సొనల మండలంలోని గుర్రల తండా గ్రామంలో కొందరు వ్యక్తులు మహారాష్ట్ర నుండి అక్రమంగా దేశిదారులు తరలించి విక్రయిస్తున్నారన్న సమాచారంతో మంగళవారం దాడి చేయగా చౌహాన్ సంజీవ్, చౌహాన్ కల్పన అనే ఇద్దరు మహారాష్ట్రకి చెందిన దేశీదారు అమ్ముతుండగా పట్టుబడ్డారు. వారి వద్ద నుండి సుమారు 105 దేశీదారు బాటిల్స్ స్వాధీనం చేసుకుని, వారిద్దరినీ అరెస్టు చేసినట్టు తెలిపినారు. ఈ దాడులలో ఎక్సైజ్ ఎస్సై విజయలక్ష్మి, సిబ్బంది బాపురావు, కార్తీక్, మౌనిక, అరుణ పాల్గొన్నారు.