ఆర్మూర్ (విజయక్రాంతి): గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు ఆర్మూర్ రూరల్ సీఐ శ్రీధర్ రెడ్డి, నందిపేట ఎస్సై చిరంజీవి తెలిపారు. ఆదివారం వారు విలేకరులతో మాట్లాడారు. నిజామాబాద్ నుంచి వచ్చి మండలంలోని వివిధ గ్రామాల్లో గంజాయి అమ్ముతున్న షేక్ అఫ్రోజ్, షేక్ మహబూబ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. నిందితుల నుంచి రెండున్నర కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.