బెల్లంపల్లి (విజయక్రాంతి): కాసిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో గల కల్వరి చర్చి ఎదుట గల టేకు చెట్లలో బల్లార్షా నుండి గంజాయి తీసుకువచ్చి అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను పట్టుకుని అరెస్టు చేసినట్లు కాసిపేట ఎస్సై వొల్లాల ప్రవీణ్ కుమార్ తెలిపారు. శుక్రవారం మందమర్రి సిఐ శశిధర్ రెడ్డి, ఎస్సై రాజశేఖర్ లు పెట్రోలింగ్ చేస్తుండగా వీరు కనిపించారన్నారు. గంజాయి అమ్ముతున్న మందమర్రికి చెందిన షహని సందీప్, ఉన్ని పవన్ అని ఇద్దరు వ్యక్తుల నుండి 140 గ్రాముల గంజాయితో పాటు పల్సర్ బైక్, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై చెప్పారు. వీరిద్దరిపై కేసు నమోదు చేశామని తెలిపారు.