calender_icon.png 25 February, 2025 | 3:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐదు కిలోల గంజాయి పట్టివేత ఇద్దరు అరెస్టు

25-02-2025 12:00:00 AM

పాల్వంచ, ఫిబ్రవరి 24 : ఆంధ్ర- ఒడిశా బార్డర్ నుండి హైదరాబాద్ కు భద్రాచలం, పాల్వంచ మీదుగా ఎండు గంజాయి తరలిస్తున్నా ఇద్దరు వ్యక్తులను సోమవారం పాల్వంచ పట్టణ పరిధిలోని నవభారత వద్ద పట్టుకున్నారు. నమ్మదగిన సమాచార మేరకు ఖమ్మం ఎన్ఫోర్స్మెంట్ టీం సీఐ సుంకరి రమేష్, సిబ్బంది  నవభారత్ వద్ద వాహనాలు తనిఖీ చేపట్టారు .

తనిఖీ చేస్తున్న క్రమంలో  ఏపీ 20 ఏపీ 4968 గల హోండా డ్రీమ్ యుగ ద్విచక్ర వాహనంపై ఐదు కేజీల ఎండు గంజాయిని, మర్రి సాయి తేజ, కట్ల వివేక్ రెడ్డి అనే వ్యక్తులు తరలిస్తూ పట్టుబడ్డారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ 2 లక్షలు ఉంటుందని సీఐ సుంకరి రమేష్ తెలిపారు.

గంజాయిని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన సీఐ రమేష్, హెడ్ కానిస్టేబుల్ కరీం, కానిస్టేబుల్స్ సుధీర్, వెంకటేష్, విజయ్, హనుమంతరావు, ఉపేందర్‌లను డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫో ర్స్మెంట్ కమలహాసన్ రెడ్డి ఐపీఎస్, ఉమ్మడి ఖమ్మం జిల్లా డిప్యూటీ కమిషనర్ జనార్దన్ రెడ్డి, అసిస్టెంట్ ఎక్స్చేంజ్ కమిషనర్ గణేష్, అసిస్టెంట్ ఎక్సుజ్ సూపర్డెంట్ తిరుపతి, వారిని అభినందించారు.