26-04-2025 01:22:08 AM
అధికారాన్ని దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు
మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి హెచ్చరిక
హైదరాబాద్, ఏప్రిల్ 25 (విజయక్రాంతి): మంత్రుల పీఏలమంటూ, సెక్రటేరియేట్ ఉద్యోగులమంటూ ప్ర జలను మోసం చేసేవారు రోజురోజు కు పెరిగిపోతున్నారు. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా అక్రమార్కులు ఏమాత్రం భయపడటంలేదు.
రెవెన్యూమంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వ్యక్తిగ త సహాయకులమని (పీఏ) చెప్పి అధికారులను, పోలీసులను, ప్రజలను మోసగిస్తున్న ఇద్దరు వ్యక్తులను గుర్తించిన మంత్రి కార్యాలయం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో నా గోల్ పోలీసులు రెవెన్యూమంత్రి పీఏలుగా చలామణి అవుతున్న ఇద్దరిని శుక్రవారం అరెస్ట్ చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన బుస్సా వెంకటరెడ్డి, మచ్చ సురేశ్ హైదరాబాద్ నా గోల్‌లో నివాసముంటున్నారు.
వీరు రెవెన్యూ మంత్రి పీఏలమంటూ రెవె న్యూ అధికారులు, పోలీసులకు ఫోన్లు చేసి వసూళ్లకు పాల్పడుతున్నారు. పీఏల పేరిట ప్రజలనూ మోసం చేస్తున్నారు. విషయం మంత్రి దృష్టికి వచ్చి న వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశా రు. దీనిపై విచారణ జరిపిన పోలీసు లు అక్రమ వసూళ్లకు పాల్పడుతు న్న ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఇకపై తన పీఏలమంటూ ఎవరైనా ఫోన్ చేస్తే సచివా లయంలోని తన కార్యాలయం 040 040 నెం బర్లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రజలకు సూచిం చారు. ఎవరైనా ఈ విధం గా అధికారాన్ని దుర్వినియోగపరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.