నిజామాబాద్ (విజయక్రాంతి): అమాయకుల కష్టార్జితాన్ని పెట్టుబడిగా పెట్టుకొని వారిని మోసగిస్తూ ఫేక్ యాప్ (MGI) మ్యట్రల్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ స్కీం ద్వారా డబ్బులు పెట్టించి మోసగిస్తున్న ఇద్దరినీ నిజామాబాద్ నగర పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్వపురాలిగా ఉన్నాయి. నిజామాబాద్ ముజాహిద్ నగర్ కు చెందిన షేక్ అమీర్ బర్కత్పురాకు చెందిన సయ్యద్ ఇమ్రాన్ అలీను నగరంలోని ఐదో టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సులువుగా డబ్బు సంపాదించాలని దొరుకుద్దితో అమాయకులనే టార్గెట్గా ఎంచుకొని ఎంజీఐ యాప్ ద్వారా డబ్బులు ఎలా రాబట్టాలో సాంకేతిక పద్ధతులను తెలుసుకొని ఆ యాప్ పద్ధతిని చూసిన నిందితుడు సయ్యద్ ఇమ్రాన్ అనే వ్యక్తి ద్వారా అధిక లాభాలు వస్తాయని అత్యాశతో స్కీం లో పలువుడ్ని చేర్పించారు. సయ్యద్ ఇమ్రాన్ తాను తాను చేరడమే కాకుండా తన మిత్రులను కూడా ఈ యాప్ లో చేర్పించాడు.
ఈ ఫేక్ యాప్ కోసమై విస్తృత ప్రచారం కూడా చేశారు. నిజామాబాద్ నగరంలోని ముజాహిద్ నగర్ హస్మికాలనీ తదితర ప్రాంతాలలో కార్యక్రమాలను నిర్వహించడం మొదలుపెట్టారు. ఈ కార్యక్రమాల నిర్వహణకు సయ్యద్ ఇమ్రాన్ కు యాప్ నిర్వహించిన నుండి 40 వేల రూపాయలను సమకూర్చాడు. వివిధ రకాల మోసపూరిత స్కీం లను ప్రజలకు చూపించి అధిక లాభాలు వస్తాయని అమాయక ప్రజలను మాయమాటలతో ప్రేరేపించి వారిని నమ్మించి ఆన్లైన్ ఎంజీఐ యాప్ నందు పెట్టుబడులు పెట్టించి మోసాలకు పాల్పడుతూ డబ్బు సంపాదిస్తున్నారని ఏసీపీ రాజా వెంకటరెడ్డి తెలిపారు. ఈ యాప్ ద్వారా 12 మంది నుండి 2,40,000 వసూళ్లకు పాల్పడి డబ్బు కాజేశారు. చాలామంది అమాయకుల నుండి ఇమ్రాన్ షేక్ అమీర్ డబ్బుల వసూళ్లకు పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. ఎంజీఐ యాప్ తో టెలిగ్రామ్ నందు ఎన్జీఐ పేరుతో ఒక ఏపీకే ఫైల్ ను బాధితులకు పంపి అది వారు డౌన్లోడ్ చేసుకునేలా చేసి తద్వారా వారికి రకరకాలైన ఆఫర్లను గోల్డ్ ఇండస్ట్రీ షేర్స్ కార్పొరేషన్ ప్రాజెక్ట్ తనీష్ గిఫ్ట్ ఫ్రొం తనీష్ క్లాసెస్ హాలిడే గిఫ్ట్స్ గోల్డెన్ ఇండస్ట్రీ షేర్స్ కార్పొరేషన్ ఫండ్ ప్రాజెక్ట్ తనిష్క్ లతో బాధితులను మభ్యపెట్టి వారిని ఆన్లైన్లో స్కానర్ ద్వారా డబ్బులు పెట్టించి ఆ తర్వాత ఆ ఆఫర్లను పొందాలంటే మళ్ళీ పేమెంట్ చేయమని స్కానర్లను పంపి మోసగించేవారని పోలీసులు తెలిపారు.
ఈ యాప్ ను వర్చువల్ ఐపీ అడ్రస్ ద్వారా అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలోని లాస్ ఎంజిల్స్ ప్రాంతం నుండి ఆపరేట్ చేస్తున్నట్టు, భారత్ దేశంలో శాలి వర్మ అనే మహిళ ఆపరేట్ చేస్తున్నట్టు వారి ద్వారా నిందితులు ఏ 1 షేక్ అమీర్ ఏ 2 సయ్యద్ ఇమ్రాన్ అలీ నిజామాబాద్ లో వివిధ ప్రాంతాలలో ఈ యాప్ ల గురించి ప్రచారం చేసి అమాయక ప్రజలను మోసం చేశారని ఏసీబీ తెలిపారు. ఈ యాప్ లలో ఒకే ఒక్కసారి వెళితే ఎందులో పై పేర్కొన్న విధంగా వివిధ ఆఫర్స్ ను ప్రకటించి మభ్యపెట్టి ఎక్కువమంది చేరే విధంగా ప్రోత్సహిస్తారు. తద్వారా ఒక వ్యక్తిని చేర్పిస్తే 50 రూపాయల నుండి 100 రూపాయల వరకు నిందితులకు వస్తాయని సభ్యులను మభ్యపెట్టి మోసపూరితంగా నిందితులు 80 వేల రూపాయల వరకు లబ్ధి పొందినట్టు పోలీసుల విచారణలో తేలింది. ఈ స్కీం ను సయ్యద్ ఇమ్రాన్ అలీ గత ఐదు నెలల నుండి నడుపుతున్నట్టు పోలీసుల విచారణలో తేలింది.
వీరి మోసపూరిత ఆప్ సమాచారాన్ని పసిగట్టిన నార్త్ రూరల్ ఇన్స్పెక్టర్ సబ్ ఇన్స్పెక్టర్ సిబ్బంది ప్రాథమిక దశలోనే గుర్తించి నిందితులను పట్టుకొని వీరిపై పట్టణ ఐదవ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. యాప్ అనేది మల్టీ లెవెల్ మార్కెటింగ్ మోసం ఈ యాప్ పట్ల ప్రజల అప్రమత్తంగా ఉండాలని ఏసీపీ రాజా వెంకటరెడ్డి ప్రజలకు సూచించారు, ఇంతే కాకుండా ఇలాంటి మోసాలు ఎక్కడైనా జరిగినట్టు జరుగుతున్న తెలిస్తే వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని ఈ మోసం అరికట్టేందుకు ప్రజలు పోలీసులతో సహకరించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.