calender_icon.png 27 December, 2024 | 8:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చోరీ కేసులో ఇద్దరు నిందితుల రిమాండ్

02-12-2024 02:19:32 AM

ఇబ్రహీంపట్నం, డిసెంబర్ 1 : ఓ వ్యక్తిని బెదిరించి ఫోన్, డబ్బు దొందగిలించిన కేసులో ఇద్దరు నిందితులను ఆదివారం ఇబ్రహీంపట్నం పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. గతనెల 28న సాయంత్రం 5 గంటలకు మన్నెగూడ లోని ఎన్‌ఎస్‌ఆర్ నగర్ కాలనీకి చెందిన పిల్లి అజయ్ (18), ఎట్టి మహేశ్ (18).. ద్విచక్ర వాహనంపై మన్నెగూడ నుంచి మంగళ్‌పల్లికి వెళ్లారు.

వారి పని ముగించుకొని మన్నెగూడ వైపు తిరుగు ప్రయాణం అవ్వగా.. మంగళ్‌పల్లి రాఘవేంద్రం హోటల్ వద్దకు రాగానే మహేశ్‌కు ఓ ఫోన్ కాల్ రావడంతో వాహనాన్ని ఆపి కాల్ మాట్లాడుతుండగా ఇంతలో యాక్టీవాపై వచ్చిన ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు.. కాల్ చేసుకుంటా ఫోన్ ఇవ్వమని వీరిని అడగడంతో ఫోన్ ఇచ్చారు.

ఇంతలో ముగ్గురిలో ఓ వ్యక్తి బండి దిగి వారిని బెదిరించి.. అతడి ప్యాంట్ జేబునుంచి రూ.3వేలు తీసుకుని అక్కడి నుంచి ఆ ముగ్గురు పరారయ్యారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. శనివారం నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు కర్మన్‌ఘాట్‌కు చెందిన అజయ్ కుమార్ (20), అంకురు ముఖేష్ (18)గా తెలిపారు.